TG: CM రేవంత్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ‘CM రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే.. కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారు. ఈ రెండేళ్లలో చేసిందేమీ లేక జూబ్లీ ఉపఎన్నికలో ఓట్లేయకపోతే సంక్షేమ పథకాలను తీసేస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి ఇస్తున్నారా?’ అని ప్రశ్నించారు.