E.G: గోకవరం మండల కేంద్రంలో ప్రధాన సమస్య అయిన బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన వంతెనను తొలగించి ఆ ప్రదేశంలో నూతన బ్రిడ్జి నిర్మించాలని కలెక్టర్ కీర్తి చేకూరికి గోకవరం బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరుకు వంతెన శిథిలావస్థకు చేరుకోవడం జరిగిందని తెలిపారు.