ATP: గుంతకల్లు పట్టణంలో యువ శక్తి కంప్యూటర్ శిక్షణ సంస్థ నందు నిరుద్యోగ యువతకు 45రోజుల పాటు ఉచిత ట్యాలి కోర్సు శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ జయన్న సోమవారం తెలిపారు. శిక్షణ అనంతరం ట్యాలి సర్టిఫికెట్, ఉపాధి అవకాశానికి సహకారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సధ్వినియోగం చేసుకోవాలని కోరారు.