VSP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రియాంక దండి సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 1.5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడలేదని ఆమె పేర్కొన్నారు. కాగ్ లెక్కల ప్రకారం ఆరు నెలల్లోనే రూ. 63 వేల కోట్లు అప్పు పెరిగిందని తెలిపారు.