జస్ప్రీత్ బుమ్రాపై మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత భారత జట్టులో బుమ్రా కంటే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విలువైన ఆటగాడని పేర్కొన్నాడు. చక్రవర్తి T20ల్లో నెంబర్ వన్ బౌలర్గా కొనసాగుతుండగా, బుమ్రా 29వ ర్యాంకులో ఉన్నాడని తెలిపాడు. ఈ గణాంకాలను బట్టి చూస్తే వైట్ బాల్ క్రికెట్లో చక్రవర్తి ఎంత ముఖ్యమైన ఆటగాడో అర్థమవుతుందని చెప్పాడు.