NZB: జాతీయ గేయం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని ముబారక్ నగర్లో గల ఓ స్కూల్లో సామూహిక వందేమాతరం గీత ఆలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి నేతలు వందేమాతరం గేయాన్ని పాడారు.