KNR: వందేమాతర గేయానికి 150వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా సహకార అధికారి కార్యాలయంలో శుక్రవారం వందేమాతరం గేయాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి ఎస్. రామానుజాచార్య మాట్లాడుతూ.. వందేమాతరం గేయం మన దేశ స్వాతంత్య్రోద్యమానికి ప్రేరణగా నిలిచిందని, దేశభక్తి భావాలను పెంపొందించే శక్తి ఈ గేయంలో ఉందని అన్నారు.