W.G: జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ప్రజలంతా జాతీయ ఐక్యతా భావంతో మెలగాలని కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, మై భారత్ జిల్లా మై భారత్ యువజన అధికారి సుంకర రాము అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. యువతలో ఐక్యత, దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా యూనిటీ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.