HNK: ‘వందేమాతరం’ గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా HNKలో BJP ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించగా ఉమ్మడి జిల్లాకు చెందిన BJP ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జాతీయ జెండాను పట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద అందరూ కలిసి వందేమాతర గేయాన్ని ఆలపించారు.