WGL: నర్సంపేట డివిజన్ సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మాణానికై శుక్రవారం నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి స్థల పరిశీలన చేశారు. సుమారు రూ.28 కోట్లతో ప్రభుత్వ కార్యాలయలు (RDO, MRO, MPDO, ఏడీఏ, MEO, రిజిస్టార్) అన్నింటిని ఒకే చోట నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్థల పరిశీలన అనంతరం పనులు మొదలు పెడతామన్నారు.