ASR: డుంబ్రిగూడ మండలం కించుమండ పంచాయతీలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అరకు పార్లమెంట్ కోశాధికారి వి.నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు నారా లోకేష్ తీసుకొచ్చిన ఈ వేదిక ద్వారా జనన, ఆదాయ పత్రాలు సహా అనేక సేవలు ఫోన్ ద్వారానే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.