నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల శుక్రవారం కోవూరు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పచ్చదనం పెంచడానికి మొక్కలు నాటాలని సూచించారు. స్టేషన్ మ్యాప్, సీసీ కెమెరాలను పరిశీలించి, పరిధిలోని నేర ప్రాంతాలపై ఆరా తీశారు. రౌడీషీటర్లు, సస్పెట్లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని ఆదేశించారు.