MDK: రహదారులపై వరి ధాన్యం అరబెట్టడంతో ప్రమాదకరంగా తయారైనట్టు మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొందరు రైతులు వరి ధాన్యాన్ని రహదారులపై అరబెటడంతో ఇరుకుగా తయారై ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ధాన్యం చుట్టూ రాళ్లు పెట్టడం, బ్లాక్ పాలిథిన్ కవర్లతో కప్పడం వలన రాత్రి వేళల్లో వాహనదారులు అవి గమనించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.