మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళిల ‘SSMB 29’ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో నటిస్తోన్న పృథీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రాజమౌళి రిలీజ్ చేశాడు. ఆయన అత్యంత శక్తివంతమైన ‘కుంభ’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపాడు. ‘పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరణ చేశాక నేను ఆయన దగ్గరికెళ్లి.. మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో ఒకరని చెప్పాను’ అని పేర్కొన్నాడు.