ATP: దక్షిణ కొరియాలోని యాన్ డాంగ్ వేదికగా జరిగిన అంతర్జాతీయ విలువల సదస్సులో అనంతపురం మేయర్ మహమ్మద్ వసీం సలీం పాల్గొన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటైన సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ తదితర వాటి గురించి వివరించారు. విలువలు కలిగిన నాయకుడు జగన్ అని ప్రశంసించారు. ఈ అవకాశం దక్కడానికి సహకరించిన వెంకటరామిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.