ఉతికే ఓపిక లేకనో, ఏమీ కాదులే అన్న ఉద్దేశంతోనో కొంతమంది వేసిన బట్టలే మళ్లీ మళ్లీ వేసుకుంటారు. షర్ట్స్, జీన్స్, జాకెట్లు పదే పదే ధరిస్తారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని, ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఒక డ్రెస్సును ఒకటి, రెండు సార్లు వేసుకుని ఉతికి మళ్లీ ధరిస్తే.. ఏం కాదని సూచిస్తున్నారు.