NZB: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిన్న మధ్యాహ్నం SRSP వరద గేట్లను మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం వరద రావడంతో ఉదయం 10:50 గం.కు 8 గేట్లను తెరిచి 25వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడిచిపెట్టినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గోదావరి నదీ తీరంలోని పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు నదిని దాటడం చేయవద్దన్నారు.