HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ నుంచి ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్లలో 23 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర మెసేజ్ పెట్టడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రచారం చేయడం వంటి వాటి ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు.