JN: జనగామ పట్టణంలోని కళ్లెం రోడ్డు కమాన్ సమీపంలో జిల్లా కురుమ సంఘం, ఒగ్గు బీర్ల సంఘం ఆధ్వర్యంలో ఒగ్గుకళా సామ్రాట్, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డా.చుక్క సత్తయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ నెల 9న ఆయన 8వ వర్థంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేయనున్నట్లు సంఘం నేతలు తెలిపారు.