CTR: వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా శుక్రవారం చిత్తూరు జిల్లా అంతటా వందేమాతరం గీతాన్ని పోలీసులు ఘనంగా ఆలపించారు. చిత్తూరు పట్టణములోని గాంధీ కూడలి వద్ద SP తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.