MDK : “వందేమాతరం” 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్లో సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఏస్పీ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెదక్ జిల్లా పోలీస్ సిబ్బంది, పాల్గొని దేశభక్తి, ఐక్యత, త్యాగం వంటి విలువలను ప్రతిబింబించే ఈ గేయాన్ని సామూహికంగా ఆలపించారు.