JGL: కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి గ్రామ శివారులోని వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకున్నట్టు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం అందడంతో పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశామన్నారు. ఇసుకను తరలిస్తున్న లారీ కనిపించడంతో పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, కేసు నమోదు చేశామన్నారు.