SRCL: సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు, వసతులు, ధాన్యం తరలింపు తదితర అంశాలపై ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంచార్జి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.