NLG: దేవాలయ, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి హెచ్చరించారు. చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారనే ఫిర్యాదుతో గురువారం పరిశీలనకు విచ్చేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఇన్ఛార్జి తహసీల్దారు విజయ ఆర్డీవోతో ఉన్నారు.