RR: జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ఫోరెన్సిక్ రిపోర్టు బయటకు వచ్చింది. ఇందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రమాదంలో మరణించిన టిప్పర్, బస్సు డ్రైవర్లు మద్యం సేవించలేదని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ తెలిపారు. అయితే, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి వాహనాల కండిషన్స్‌కు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉందన్నారు.