SKLM: అర్హత కలిగిన మహిళా సంఘాలకు సరైన డాక్యుమెంటేషన్ ఉంటే శ్రీ నిధి ద్వారా రూ. 8 లక్షల వరకు రుణం మంజూరు అవుతుందని గురువారం మందస వెలుగు పీవో పైడి. కూర్మారావు అన్నారు. మందస గ్రామ సచివాలయం, పంచాయతీ కార్యాలయాల వద్ద మహిళా సంఘాలకు సంబంధించిన రుణాల మంజూరు పోస్టర్లను ఆవిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.