ADB: గాదిగూడ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర నీటి కష్టాలు నెలకొన్నాయి. పిల్లలు మంచి నీటి కోసం ఖాళీ సమయాల్లో సమీప వాగులకు వెళ్తున్నారు. గమనించిన ఆదివాసీ గిరిజన సంఘం సభ్యుడు సక్కు గురువారం పాఠశాలను సందర్శించారు. సమస్యను మండల విద్యాధికారితో పాటు ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లేదని వాపోయారు.