AP: కొంత మంది మంత్రుల పనితీరు బాగోలేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సమావేశంలో మంత్రుల పనితీరు నివేదికనూ ప్రస్తావిస్తానని అన్నారు. కొందరు మంత్రులు వారి పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. వచ్చె నెలకల్లా మంత్రులు, అధికారుల పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. మనమంతా ఒక టీమ్ అనే విషయం అధికారులు గుర్తుంచుకోవాలన్నారు.