TG: పోలీసులు నిజాయితీ, వృత్తి నైపుణ్యత ప్రదర్శించాలని DGP శివధర్ రెడ్డి సూచించారు. ఎవరూ చూడని వేళల్లో కూడా సత్యనిష్టగా ఉండాలని, పౌరుడి భావనను అర్థం చేసుకోవాలని తెలపారు. పనిలో ప్రావీణ్యం సాధించాలని తెలిపారు. పోలీస్ అధికారికి నిజమైన అధికారం యూనిఫాం మీద ఉన్న నక్షత్రాల వల్ల రాదనీ, ప్రజల కళ్లలో కనిపించే విశ్వాసం వల్ల వస్తుందని చెప్పారు.