JGL: కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడంతో, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రతా చర్యలను బలోపేతం చేశారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు, జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.