కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ ఇటీవల నగరంలో ఆస్తి పన్నులు పెంచుతామని, పార్కులను ప్రైవేటీకరణ చేయనున్నారు అని ప్రకటించడం, అలాగే ఖాళీ స్థలాలను పరిశుభ్రం చేయకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని చెప్పడం విమర్శలకు కారణమైంది. దీంతో మరోవైపు, కలెక్టర్గా పిఠాపురానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి.