TG: హైదరాబాద్ షేక్ పేటలో MIM నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని BRS ఆరోపించింది. పోలింగ్ ఏజెంట్లను కార్వాన్ ఎమ్మెల్యే బయటకు పంపారని.. కొంతమంది ఐడీ కార్డులు లేకున్నా ఓటు వేస్తున్నారని మండిపడింది. వీడియోలు తీస్తున్నవాళ్ల ఫోన్లను కూడా స్థానిక ఎంఐఎం నేతలు లాక్కున్నారని విమర్శించింది. 4 గంటల తర్వాత పెద్ద ఎత్తున రిగ్గింగ్కి ప్లాన్ చేశారని ఆరోపించింది.