CTR: ఆరోగ్య రంగం వేగంగా మారిపోతున్న ఈ యుగంలో, ఆవిష్కరణలతో కూడిన సమర్థవంతమైన నిర్వహణే విజయానికి మార్గమని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) లక్నో ప్రొఫెసర్ డా.వెంకటరామయ్య అన్నారు. ఆపోలో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గురువారం ‘ఆరోగ్య నిర్వహణలో ఆవిష్కరణలు’ అన్న అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉపన్యాసంలో ప్రసంగించారు.