VZM: ఎస్.కోట పట్టణం అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్న అని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఈమేరకు పుణ్యగిరి రైల్వేస్టేషన్ దగ్గర గాయత్రి కాలేజీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ గురువారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు.