ఉమెన్స్ వరల్డ్ కప్ విజయానికి గుర్తుగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన చేతిపై ట్రోఫీ టాటూ వేయించుకుంది. ఈ సందర్భంగా ‘నీ కోసం ఫస్ట్ డే నుంచి ఎదురుచూశా. ఇకపై ప్రతిరోజూ చూస్తా’ అనే క్యాప్షన్‌తో టాటూ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా మెగా టోర్నీలో హర్మన్ జట్టును సమర్థంగా నడిపించింది. ప్లేయర్‌గానూ 260 రన్స్ చేసింది.