KRNL: కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో బుధవారం జరిగిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి హాజరయ్యారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతులు వేసిన మొక్కజొన్న, కంది పంటల సాగు విధానాలను ఆమె పరిశీలించారు. రైతులు తప్పనిసరిగా అధికారుల సూచనలు స్వీకరించాలని కలెక్టర్ రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు.