NDL: కొలిమిగుండ్ల ఎంపీడీవోగా దస్తగిరిబాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు. నూతన ఎంపీడీవో దస్తగిరిబాబును స్థానిక ఉద్యోగులు పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కొలిమిగుండ్లలోని ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని నూతన ఎంపీడీవో పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమని ఆయన అన్నారు.