TG: జూబ్లీహిల్స్లో ఇప్పటివరకు BJP విజయం సాధించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, BRS మధ్యే ప్రధాన పోటీ ఉండేదని.. BJP మూడో స్థానానికే పరిమితమయ్యేదన్నారు. కానీ ఈ ఉపఎన్నికలో త్రిముఖ పోరు ఉందని జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇంకా ఎవరికి ఓటు వేయాలనే దానిపై నిర్ణయానికి రాలేదని.. అందుకే సర్వే ఫలితాల్లో తేడాలు ఉన్నాయన్నారు.