పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఇవాళ శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తాలిబాన్లకు వార్నింగ్ ఇచ్చారు. శాంతి చర్చలు ఫలించకపోతే.. తాలిబన్లతో యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ చర్చలు విఫలమైతే ఇరుదేశాల మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. శత్రువుల యాక్షన్ బట్టి.. తమ రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.