NRML: సారంగాపూర్ మండలం అడెల్లి శ్రీ మహా పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం నాల్గవ రోజు ప్రత్యేక హోమాధి కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆలయ కమిటీ చైర్మన్ కోరారు.