KRNL: జిల్లాలో పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను తరలిస్తున్న ఐదు ఆటోలను సీజ్ చేసినట్లు పెద్దకడబూరు మండల ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇవాళ కొంత మంది ఆటో డ్రైవర్లకు పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఇప్పటి నుంచి ఆటోలలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికులను తరలించాలని సూచించారు.