NLG: కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చింతపల్లిలో సభ్యులతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.