MNCL: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ జాగరూకత దివాస్‌ను గురువారం పోలీసులు నిర్వహించారు. ACP రవికుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక యుగంలో యువత ఇంటర్నెట్ వాడకంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను ఎలా టార్గెట్ చేస్తున్నారో వివరించారు. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం పంచుకోవద్దన్నారు.