AP: పరకామణి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసుపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో సీఐడీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరర్ రెడ్డి, అప్పటి టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ను విచారించనున్నారు. ఈ మేరకు 20 మంది సభ్యులతో ఐదు బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నారు.