KRNL: తుగ్గలి మండలం గుత్తి ఎర్రగుడి గ్రామంలో అపార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని డైరీ జీవనోపాధి కలిగిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు, పాడి రైతులకు ఈ శిబిరం ద్వారా వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పశు వైద్యులు పీర్ బాష, తదితరులు పాల్గొన్నారు.