ELR: జిల్లాలో పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ.. పత్తి రైతులకు మద్దతు ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి రైతు ఈ-క్రాప్ బుకింగ్, ఈ పంటలో నమోదయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. జంగారెడ్డిగూడెంలో పత్తి పంట అమ్మకాలకు సంబంధించి సీసీఐ సెంటర్ ఉందన్నారు.