KMR: బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డిలో ఇవాళ విద్యుత్ షాక్తో రెండు గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎర్రోళ్ల స్వామి తన గొర్రెల మందను మేతకు తీసుకెళ్లినట్లు చెప్పారు. గ్రామ శివారులో మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు రెండు గొర్రెలకు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు.