MDCL: మల్కాజ్గిరి PS పరిధిలో దారుణం చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు దమ్మాయిగూడ నివాసిగా గుర్తించారు.