అనకాపల్లి: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నక్కపల్లి కేంద్రంగా మరో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. మంత్రివర్గం ఉప సంఘంలో చర్చించి కొత్త రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను హోం మంత్రి వంగలపూడి అనిత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.