ప్రకాశం: తర్లుపాడు మండలం జగన్నాధపురం – ఓబాయపల్లి గ్రామాల మధ్య ఇటీవల కురిసిన వర్షాలకు పక్కనే ఉన్న కాలువ నిండడంతో నీటిని బయటికి పంపించేందుకు తారు రోడ్డుకు గండి కొట్టారు. తద్వారా వాహనదారులు తర్లుపాడు వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. గండి కొట్టినా కానీ బయటికి వెళ్లట్లేదని అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని ఓబాయపల్లి గ్రామస్తులు కోరారు.